వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గుంటూరు, విశాఖ జిల్లాల నేతలతో భేటీ కానున్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గుంటూరు, విశాఖ జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఈనెల 19న (బుధవారం) గుంటూరు జిల్లా నేతలు, 21న విశాఖ జిల్లా నేతలతో ఆయన హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అవుతారు.
అలాగే రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22న లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ ...పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాగా ఈనెల 24, 25 తేదీలలో ఒంగోలులో జరిగే ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొంటారు.