మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.
పులివెందుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజారెడ్డి సమాధి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సీపీ సీఎల్పీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి శుక్రవారం పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది రాజారెడ్డి వర్థంతిని వైఎస్ఆర్ సీపీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహస్తున్న విషయం తెలిసిందే.