
చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు?
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్దాలకు విసుగెత్తి ప్రజలందరూ తమ తరపున పోరాటం చేయాలని కోరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
కర్నూలు : ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్దాలకు విసుగెత్తి ప్రజలందరూ తమ తరపున పోరాటం చేయాలని కోరుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నేతలతో రెండోరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు ఏం చెప్పారు?... ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. అందుకే బాబు రోజుకో అబద్దం చెబుతున్నారని, ఆయన నిజం చెప్పిననాడు.. జనం ఆయన్ని రాళ్లతో కొడతారని వైఎస్ జగన్ అన్నారు.
అర్బన్ ఏరియాలో నరేంద్ర మోదీ గాలి టీడీపికి కలిసొచ్చిందని అన్నారు. రుణమాఫీ అన్న అబద్దం చెప్పి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కేదన్నారు. ముఖ్యమంత్రి కావటం కోసం అబద్దాలు చెప్పడం సరికాదని, చంద్రబాబులా తాను అబద్దాలు చెప్పలేను అని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీకి, వైఎస్ఆర్ సీపీకి ఓట్ల సంఖ్యలో తేడా కేవలం 5 లక్షల మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్నారని... అయితే బాబు వస్తే ఉన్న జాబు పోయిందని అంటున్నారని వైఎస్ జగన్ అన్నారు.