ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్ | ys jagan mohan reddy dial to gottipati ravikumar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్

Jan 12 2015 8:44 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్ - Sakshi

ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్

టీడీపీ నేత కరణం బలరాం వర్గీయుల దాడికి గురైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.

ఒంగోలు: టీడీపీ నేత కరణం బలరాం వర్గీయుల దాడికి గురైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. దాడి జరిగిన తీరును ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఢిల్లీ నుంచి రవికుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు.

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement