నారాయణను ఫోన్‌ లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌ | ys jagan called ap minister narayana on phone, conveyer deep sorrow | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణకు వైఎస్‌ జగన్‌ ఫోన్‌కాల్‌

May 11 2017 12:26 PM | Updated on Jul 25 2018 4:42 PM

నారాయణను ఫోన్‌ లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌ - Sakshi

నారాయణను ఫోన్‌ లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.  వైఎస్‌ జగన్‌ గురువారం మంత్రి నారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిషిత్‌ మృతిపట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు అతని అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement