వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మరోవైపు పుష్పగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది.