విశాఖలో యువతి సజీవదహనం | women murdered in vishka distirict | Sakshi
Sakshi News home page

విశాఖలో యువతి సజీవదహనం

Aug 5 2015 12:01 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ జిల్లాలో ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి సజీవదహనం చేశారు.

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గొలిగొండ మండలం అప్పన్నపాలెంలోమంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇల్లు ఊరికి చివర ఉండటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దివ్య అనే యువతి తల్లిదండ్రులు ఊరి చివరన ఉన్నజీడిమామిడి తోటలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. తల్లి దండ్రులు సొంతపనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లారు.

పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దివ్య(18) సజీవ దహనమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, ఆ తర్వాల పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement