ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి వద్ద ఓ యువతి మంగళవారం ఆందోళనకు దిగింది.
గంటావారిగూడెం (నల్లజర్ల రూరల్):ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి వద్ద ఓ యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. గంటావారిగూడెంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడేనికి చెందిన సిరిబత్తుల పద్మ గంటావారిగూడెంలో తన తాతయ్య ఇంట్లో ఉంటూ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది.
ఇదే గ్రామానికి చెందిన మట్టా రాంబాబుతో ఆమె ప్రేమలో పడింది. రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి ప్రసక్తి తీసుకువస్తే రాంబాబు మొహం చాటేశాడని పద్మ తెలిసింది. ఈ విషయమై ఈనెల 15న అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పెద్దలు సర్దుబాటు చేస్తారని చెప్పినా వినకుండా మంగళవారం ఉద యం రాంబాబు ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంబాబు అక్కడికి వెళ్లి పద్మ తో మాట్లాడారు. పద్మ మేనమామ మాట్లాడుతూ బుధవారం విషయూన్ని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.