మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన యువకుడు | Woman attacked by youth in guntur district | Sakshi
Sakshi News home page

మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన యువకుడు

Jan 4 2015 9:38 AM | Updated on Sep 2 2017 7:13 PM

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో దారుణం చోటు చేసుకుంది.

గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో దారుణం చోటు చేసుకుంది. మహిళపై కిరోసిన్ పోసి యవకుడు నిప్పంటించాడు. దాంతో యువతి బిగ్గరగా గట్టిగా కేకలు వేయడంతో... చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని మంటలార్పి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. నిందితుడు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement