భర్తపై తప్పుడు కేసు పెట్టిన భార్యకు.. | Wife Fined for False Case of Husband Kurnool | Sakshi
Sakshi News home page

భర్తపై తప్పుడు కేసు పెట్టిన భార్యకు..

Sep 6 2019 7:29 AM | Updated on Sep 6 2019 7:29 AM

Wife Fined for False Case of Husband Kurnool - Sakshi

సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): భర్తపై తప్పుడు కేసు పెట్టిన ఓ భార్యకు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఆత్మకూరు జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తన భర్త శ్రీనివాసులు రెండో విహహం చేసుకుని, ఆమె ద్వారా పిల్లలు కన్నారంటూ ఆత్మకూరు పట్టణానికి చెందిన మంగళి గౌరిదేవి 2014లో కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసింది. ఐదేళ్ల అనంతరం తన వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పడంతో  ఇన్‌చార్జ్‌ మెజిస్ట్రేట్‌ ఫకృద్దీన్‌ గురువారం కేసును కొట్టివేశారు. సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన కేసును కోర్టు ముందుకు తెచ్చి, కోర్టు సమయాన్ని, ప్రతివాదుల సమయాన్ని వృథా చేసినందుకు మంగళి గౌరిదేవి రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేకపోతే 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement