జోరుగా వర్షాలు

Widespread Rains lashed across Andhra Pradesh - Sakshi

నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది.    

సాక్షి నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి.  పలు జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. 

► కృష్ణా జిల్లా లింగగూడెం వద్ద గండి వాగు పొంగటంతో పెనుగంచిప్రోలు–విజయవాడ మధ్య.. మరోవైపు ముండ్లపాడు మీదుగా నందిగామ, విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. జి.కొండూరు మండలంలో పులివాగుపై కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  
► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలు ముంపు బారినపడ్డాయి. విశాఖ, నెల్లూరు, అనంతపురం,  వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. 
మరో మూడు రోజులు వర్షాలు
► వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. 
► ఈ నెల 18న కోస్తాంధ్ర, 19న ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top