చేనేతల ఆకలి చావులను ఆపండి | Sakshi
Sakshi News home page

చేనేతల ఆకలి చావులను ఆపండి

Published Tue, Sep 16 2014 2:37 AM

చేనేతల ఆకలి చావులను ఆపండి

ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన చేనేత కార్మికులు 
 
 ధర్మరవరం రూరల్ : చే నేతల ఆకలి చావులను ఆపి చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించి, ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. చేనేతకు కేటాయించిన 11 రకాలను పవర్ లూమ్స్ ద్వారా తయారు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని  ఈ జిల్లాలోనే ఏర్పాటు చేసి చట్టాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పవర్ లూమ్స్‌లో ఉత్పత్తి చేయడం వలన 50 శాతం మగ్గాలు మూతపడి దాదాపు 2 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేనే తల రుణాల విషయం 174 జీఓలో పేర్కొనకపోవడం చేనేత కార్మికులను మోసం చేయడమేనన్నారు. బడె ్జట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చి కేవలం 99 కోట్లు మాత్రమే  కేటాయించడం దారుణ మన్నారు. ప్రతి కార్మికుడికి రూ.ల క్ష రుణం అందజేయాలని,  50 శాతం సబ్సిడీతో ముడిసరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రమేష్‌కు అందజేశారు. చేనేత నాయకులు పోలా లక్ష్మినారాయణ, ఖాదర్‌బాషా, అన్నం సూర్యనారాయణ, ఆంజనేయులు,  సీఐటీయు నాయకులు హైదర్‌వలి, ఎల్.ఆదినారాయణ పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement