30 వేల ఎకరాలకు పైగా భూమి సాధించాం | we have got 30 thousand acres | Sakshi
Sakshi News home page

30 వేల ఎకరాలకు పైగా భూమి సాధించాం

Mar 1 2015 3:31 AM | Updated on Sep 2 2017 10:05 PM

రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటి వరకూ 30 వేల ఎకరాలకు పైగా భూమిని సాధించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

తాడికొండ: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటి వరకూ 30 వేల ఎకరాలకు పైగా భూమిని సాధించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సమీకరణ గడువు శనివారంతో ముగిసిందని  తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  నారాయణ మాట్లాడారు. ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం భూ సమీకరణ ఇంకా మిగిలి పోతే మార్చి నుంచి భూసేకరణకు తప్పకుండా వెళతామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement