సాగునీరు అందించడమే లక్ష్యం


 వెంకటాచలం: రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాగునీరు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ఎంఆర్‌సీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికి ప్రధానకారణం ప్రభుత్వ యంత్రాగం, అధికారుల ముందుచూపు లేకపోవడమేనని ఆయన ఆరోపించారు. రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే ఈ సమయంలో నీటిపారుదల శాఖలోని అధికారులను బదిలీ చేయడంపై ఆయన మండిపడ్డారు. సంగం బ్యారేజి వద్ద మరో రెండు అంగుళాలు నీటిమట్టం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నీటిమట్టాన్ని అంచెలంచెలుగా పెంచి మోటార్ల కింద ఆయకట్టుకు, చెరువు కాలువ ఆయకట్టుకు నీరు అందించేందుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

 

 విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏడు గంటలకు మరో మూడు గంటలు పెంచి పది గంటలు రైతులకు విద్యుత్ అందించే లా చూస్తానన్నారు. రైతుల సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ డివి.సుధాకర్, ఎంపీడీఓ టి. సుగుణమ్మ, జెడ్పీటీసీసభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్, హుస్సేన్, సర్పంచ్ పోట్లూరి మణెమ్మ, ప్రిన్సిపల్ పెంచలయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కరియావుల చెంచుక్రిష్ణయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, పెళ్లూరు సుధాకర్‌రెడ్డి, పద్మనాభనాయుడు, కొణిదన మోహన్ నాయుడు, రావి బాలక్రిష్ణమనాయుడు, రావూరు కోదండనాయుడు, నాటకం శ్రీనివాసులు, మందల పెంచలయ్య, డబ్బుగుంట వెంకటేశ్వర్లు, పాశం ప్రభాకర్, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top