భారీ గణేశ్‌ను ఏర్పాటు చేస్తాం: భూమన | Vinayak Sagar Development Is Our Aim Said By Bhumna Karunakar Reddy | Sakshi
Sakshi News home page

వినాయక సాగర్‌లో భారీ గణేశ్‌ను ఏర్పాటు చేస్తాం: భూమన

Aug 25 2019 5:01 PM | Updated on Aug 25 2019 5:13 PM

Vinayak Sagar Development Is Our Aim Said By Bhumna Karunakar Reddy - Sakshi

సాక్షి, తిరుపతి: నగరంలోని వినాయక సాగర్‌ అభివృద్ధే తమ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.22 కోట్లతో వినాయక సాగర్‌ను శోభాయమానంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన టెండర్లు రెండు నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు. టెండర్లు పూర్తయిన వెంటనే ఏడాదిలోగా పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. వినాయక సాగర్‌లో అతి పెద్ద వినాయక విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు . అందుకుగానూ వినాయక మహోత్సవ కమిటీకి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement