నోట్లు ఇచ్చేవారికి ఓట్లు వేయొద్దని విద్యార్థులకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు ఉద్బోధించారు.
నెల్లూరు: నోట్లు ఇచ్చేవారికి ఓట్లు వేయొద్దని విద్యార్థులకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. పాఠ్యాంశాల్లో నైతిక విలువలు చేర్చే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు.
తన స్వగ్రామం చవలపాలెంలోనూ ఆయన పర్యటించారు. కమ్యూనిటీ హాల్, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీయిచ్చారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పుట్టిన స్వగ్రామ అభివృద్ధిని మరువనని చెప్పారు.