నిరుద్యోగ సమస్య తీర్చాలి | Unemployeed Youth Meet YS jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ సమస్య తీర్చాలి

Nov 21 2018 7:58 AM | Updated on Nov 21 2018 7:58 AM

Unemployeed Youth Meet YS jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం :మీరు సీఎంగా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంతా మోసం, దగా. మాయమాటలు చెబుతూ మమ్మల్ని మోసం చెస్తూ ఐదేళ్ల పాటు పబ్బం గడుపుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారో చూస్తాం.. మేం అంతా మీ వెనుక ఉన్నాం. మిమ్మల్ని గెలిపించుకొవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు తండ్రి బాటలొ నడిస్తారన్న నమ్మకం మాకుంది.–దేవాతి జోజో

నిరుద్యోగ సమస్య తీర్చాలి
మా గ్రామాల్లో యువతీ, యువకులు అంతా డిగ్రీలు పూర్తి చేసి ఉన్నాం. ఎవ్వరికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నాం. మా గ్రామాల్లో పాఠశాలలు లేకపోయినా దూరప్రాంతాల్లో హాస్టళ్లలో ఉండి కష్టపడి చదువుకున్నాం. అయినా ఫలితం లేకుండా పోతుంది. మా జిల్లాలో కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నా. మీరు అధికారంలోకి రాగానే జిల్లాలో కొత్త పరిశ్రమలు తేవడంతో పాటు, మూత పడిన పరిశ్రమలను తెరిపించి, మా గిరిపుత్రులకు చేరువలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌లు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నా...
–వంగల దేవి, ముదుల శిరీష

Advertisement
 
Advertisement
Advertisement