చంద్రబాబు పదవుల నుంచి తప్పుకో.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పదవుల నుంచి తప్పుకో..

Published Tue, Jun 16 2015 11:56 AM

చంద్రబాబు పదవుల నుంచి తప్పుకో..

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ను గద్దె దించినప్పుడు రోజుకో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఇప్పుడు  ఎందుకు శ్వేతప్రతం విడుదల చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లి మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సీఎం పదవి నుంచి, పార్టీ అధ్యక్షుడిగా కూడా తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ వ్యవహారంలో ఆడియో తనది కాదని చెప్పి చంద్రబాబు దేశమంతా అల్లరయ్యారన్నారు.  ఈ వ్యవహారం జరిగిన తర్వాతే ఏపీ ప్రభుత్వానికి సెక్షన్-8 గుర్తుకొచ్చిందా అని ఉండవల్లి ప్రశ్నించారు.  ఇక దేశంలో ఏ ప్రాజెక్టులోనూ జరగని అవినీతి పట్టిసీమలో జరుగుతోందని, పట్టిసీమకు వెళ్లి తప్పులు నిరూపిస్తానని, ప్రభుత్వం ఒక ప్రతినిధిని పంపాలని, తన ఆరోపణలు తప్పు అని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement