కారు - లారీ ఢీ: ఇద్దరు మృతి | Two killed in road accident at nellore district | Sakshi
Sakshi News home page

కారు - లారీ ఢీ: ఇద్దరు మృతి

Dec 25 2014 8:27 AM | Updated on Aug 30 2018 3:58 PM

నెల్లూరు జిల్లా దొరవారి సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం కారు - లారీ ఢీ కొన్నాయి.

నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం కారు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement