అనాధాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం | two girls missing from orphan home | Sakshi
Sakshi News home page

అనాధాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

Jun 17 2017 11:49 AM | Updated on Sep 5 2017 1:52 PM

అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నగరంలోన కలకలం సృష్టిస్తోంది.

విజయవాడ: అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నగరంలోన కలకలం సృష్టిస్తోంది. స్థానిక గురునానక్‌ కాలనీలోని పవిత్రాత్మానికేతన్‌ అనాధాశ్రమంలో ఉంటున్న రోహిణి(13), మరియమ్మ(11) అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారంటూ ఆశ్రమ నిర్వాహకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement