
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పదవీ బాధ్యతలను చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.. కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలను బహూకరించారు. ఆయనను శాలువాతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 50వ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాలు, నియమాలను గౌరవిస్తూ టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతామని, టీటీడీ మీద వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని ఆయన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో పేర్కొన్నారు.