
నిర్వాసితులకు ఇళ్లులేదు..హెరిటేజ్ కు షాపా?
అది సాక్షాత్తు దేవదేవుడు కొలువైన తిరుమల కొండ. ఆ కొండమీదే అక్రమాలు చోటుచేసుకున్నాయి.
తిరుపతి: అది సాక్షాత్తు దేవదేవుడు కొలువైన తిరుమల కొండ. ఆ కొండమీదే అక్రమాలు చోటుచేసుకున్నాయి. వివరాలు...సామాన్యులు తిరుమల కొండపై షాపు ఏర్పాటు చేసుకోవాలంటే సవాలక్ష అడ్డంకులు సృష్టించే టీటీడీ అధికారులు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థకు మాత్రం క్షణాల్లో అనుమతులిచ్చేశారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ సొంత ఇళ్లులేక నిర్వాసితులుగా ఉన్న వారిని టీటీడీ ఎప్పుడూ పట్టించుకోలేదు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కు మాత్రం అడిగిన వెంటనే షాపు కోటాయించిందని సీపీఎం నేత కందారపు మురళి ఆరోపించారు. ప్రభుత్వానికొక నిబంధన, ప్రజలకొక నిబంధనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.