'రామలింగరాజుకు లోకేష్ పెంపుడు కొడుకు' | TRs takes chandrababu naidu son Nara Lokesh | Sakshi
Sakshi News home page

'రామలింగరాజుకు లోకేష్ పెంపుడు కొడుకు'

Dec 14 2013 1:36 PM | Updated on Aug 29 2018 3:37 PM

'రామలింగరాజుకు లోకేష్ పెంపుడు కొడుకు' - Sakshi

'రామలింగరాజుకు లోకేష్ పెంపుడు కొడుకు'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్పై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్పై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సత్యం రామలింగరాజు పెంపుడు కొడుకు లోకేష్ అని.... ఆయన డబ్బులతోనే చిన్నబాబు విదేశాల్లో చదివాడని ఆపార్టీ ఆరోపించింది. లోకేష్...'ట్విట్టర్‌కి ఎక్కువ...రాజకీయాలకు తక్కువ' అంటూ టీఆర్ఎస్ ఎద్దేవా చేసింది.

కాగా  ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా  టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్‌లో పడుకునే ఉన్నారని లోకేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించటమే కాకుండా, ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ విమర్శలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement