బడి బస్సులపై రవాణాశాఖ తనిఖీలు

Transport Department Audits School Busses In Prakasam - Sakshi

పది విద్యాసంస్థల బస్సులు సీజ్‌

రోడ్డెక్కని 450 బస్సుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి

ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం రవాణాశాఖ ఉప కమిషనర్‌ సీహెచ్‌వీకే  సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరిగాయి. ఉదయం 7 గంటలు   9.30 వరకు అన్ని ప్రధాన రహదారులపైన 11 మంది మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లు వారి బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు పరిధిలో చర్చిసెంటర్, కర్నూల్‌రోడ్డు ఫ్‌లై ఓవర్, కొత్తపట్నం బస్టాండు సెంటర్, దక్షిణ బైపాస్, వెంగముక్కలపాలెం రోడ్డు, టంగుటూరు టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు జరిగాయి. అదే వి«ధంగా చీరాల, కందుకూరు, దర్శి, మార్కాపురం ప్రాంతాలలో కూడా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌లు పొందకుండా నడుపుతున్న పది విద్యాసంస్థల బస్సులను సీజ్‌ చేసినట్లు రవాణాశాఖ ఉప కమిషనర్‌ సీహెచ్‌వీకే సుబ్బారావు తెలిపారు.

జిల్లాలో మొత్తం 1630 పాఠశాల బస్సులు ఉన్నాయని, వాటిలో 1180 బస్సులకు 2018–19 విద్యా సంవత్సరానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌లు ఇచ్చామన్నారు. సర్టిఫికేట్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చిన బస్సులను ఒంగోలులో–7, చీరాల–2, దర్శి–1 సీజ్‌ చేశామన్నారు. మరో 450 బస్సులు ఇంకా రోడ్డుపైకి రాలేదని, వాటికిపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. వాటిలో కొన్ని బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి దాటాయని గుర్తించామన్నారు. అటువంటి బస్సులు ఫిట్‌నెస్‌ ఉన్నా వాటికి రాయితీతో కూడిన పన్ను చెల్లింపు కుదరదని, వారు తప్పనిసరిగా సీటుకు రూ.397 చొప్పున చెల్లించి నడుపుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top