పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్ల రాకపోకల్లో అవాంతరం | Trains run late due to Heavy Rains in East Godavari district | Sakshi
Sakshi News home page

పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్ల రాకపోకల్లో అవాంతరం

Jun 20 2015 6:27 PM | Updated on Aug 11 2018 8:24 PM

భారీ వర్షాలు, ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేహట్ కుప్పకూలిపోయింది.

గొల్లప్రోలు (తూర్పు గోదావరి) : భారీ వర్షాలు, ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేహట్ కుప్పకూలిపోయింది. దీంతో సిగ్నల్, టెలికం వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పిఠాపురం-అన్నవరం మధ్య రైళ్లరాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మాన్యువల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో ఆ స్టేషన్ల మధ్య రైళ్లు నెమ్మదిగా ప్రయాణించాయి. రైల్వే డివిజనల్ ఇంజనీర్ దీనదయాళ్ నేతృత్వంలో విజయవాడ, రాజమండ్రి, తుని, సామర్లకోట స్టేషన్లకు చెందిన రైల్వే సిబ్బంది శనివారం ఉదయం నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా సిగ్నల్‌హట్‌ను తీసుకువచ్చి బోర్డుకు అమర్చి సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని డీఈ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement