నల్లమలలో పులులు ఎన్నున్నాయో? | Sakshi
Sakshi News home page

నల్లమలలో పులులు ఎన్నున్నాయో?

Published Sat, May 10 2014 5:49 PM

నల్లమలలో పులులు ఎన్నున్నాయో?

శ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలో శుక్రవారం నుంచి పులుల లెక్కింపు ప్రారంభించినట్లు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖాదర్ వలీ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు లెక్కింపు ఉంటుందన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో లెక్కింపును చేపట్టామన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్లో పులులు ఎన్ని ఉన్నాయనేది లెక్కింపు తర్వాత తెలుస్తోంది. పులుల సంఖ్యపై జంతు ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement