నీలి చిత్రాల సీడీలు విక్రయిస్తున్న యువకులు అరెస్ట్ | Three youth arrested in ibrahimpatnam krishna district | Sakshi
Sakshi News home page

నీలి చిత్రాల సీడీలు విక్రయిస్తున్న యువకులు అరెస్ట్

Aug 5 2015 2:02 PM | Updated on Apr 3 2019 4:43 PM

ఇంటర్‌నెట్ నుంచి నీలి చిత్రాలను డౌన్‌లోడ్ చేసి వాటిని సీడీల రూపంలో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.

విజయవాడ : ఇంటర్‌నెట్ నుంచి నీలి చిత్రాలను డౌన్‌లోడ్ చేసి వాటిని సీడీల రూపంలో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను  పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్టణం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సునీల్, వినోద్, నాగార్జున అనే ముగ్గురు యువకులు మండల కేంద్రంలో హైస్పీడ్ ఇంటర్‌నెట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.

కాగా వారు మంగళవారం అర్ధరాత్రి ఇంటర్‌నెట్ సెంటర్‌లో నీలి చిత్రాలను డౌన్‌లోడ్ చేసి సీడీల రూపంలో విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇంటర్‌నెట్ సెంటర్‌పై దాడి చేసి ముగ్గరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement