ప్రమాదవశాత్తూ కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Mar 22 2017 7:18 PM | Updated on Aug 28 2018 7:15 PM
చిత్తూరు (తిరుపతి రూరల్): ప్రమాదవశాత్తూ కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. వివరాలు..తిరుపతి రూరల్ మండలం పేరూరులోని వకుళమాత ఆలయ సమీపంలో చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. పేరూరు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ(30) బట్టలు ఉతకడానికి తన పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలు నాచు వల్ల ప్రమాదవశాత్తూ కుంటలోకి జారిపడ్డారు. పిల్లల్ని కాపాడటానికి దూకిన ఆదిలక్ష్మీ కూడా చనిపోయింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి(30), భార్గవి(10), సురేష్(8)లు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement