పిడుగుపాటుకు ముగ్గురు మృతి | Three dies due to Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

May 29 2015 8:07 PM | Updated on Sep 3 2017 2:54 AM

శుక్రవారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షాలకు పిడుగులుపడి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు.

వైఎస్సార్ జిల్లా :  శుక్రవారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షాలకు పిడుగులుపడి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..  వైఎస్సార్ జిల్లా నిజాంనగర్ కాలనీకి చెందిన చిన్న గంగన్న(52)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. చిన్న గంగన్న మృతితో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

అదేవిధంగా పెండ్లిమర్రి మండలం బుడ్డాయపాలెంలో మరో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. కాగా మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement