వెయ్యికోట్ల రుణాలిస్తాం | Thousand crores loans will issue for farmers | Sakshi
Sakshi News home page

వెయ్యికోట్ల రుణాలిస్తాం

Jan 19 2014 4:35 AM | Updated on Sep 2 2017 2:45 AM

రబీ సీజన్‌లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు.

కృష్ణానగర్(మాక్లూర్), న్యూస్‌లైన్ : రబీ సీజన్‌లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం మండలంలోని కృష్ణానగర్‌లో  వరి నాటే యంత్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం  రైతులను ఉద్దేశించి మాట్లాడారు.  రైతులకు రూ. 700కోట్ల రుణాలు సరిపోవని, వెయ్యి కోట్ల రుణాలు అవసరం ఉందని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రూ. 560 కోట్ల రుణాలు చెల్లించినట్లు చెప్పారు.  రైతులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రుణాలు సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
 
 ఆర్మూర్, బోధన్, భిక్కనూరు మండల కేంద్రాల్లో సోయా సీడ్స్ విత్తన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రైతులు మార్కెట్‌లోనే  కూరగాయలు అమ్ముకోవాలన్నారు. దళారులకు అమ్ముకోవ ద్దని సూచించారు. రైతులకు సబ్సిడీ పై టాటా ఏసీ వాహనాలు ఇస్తామని వారు ముందుకు రావాలని సూచించారు. పేద ప్రజ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కృష్ణానగర్ రైతులు సాగు చేస్తున్న పంటలను ఆడిగి తెలుసుకున్నారు. కృష్ణానగర్ గ్రామ శివారులోని బీటీ రోడ్డు పై కేజ్‌వీల్ ట్రాక్టర్లు నడవడంవల్ల రోడ్డు చెడిపోవడంతో తహశీల్దార్ నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు చెడిపోతే మళ్ళీ రోడ్లు ఎవ రూ బాగు చేస్తారని ప్రశ్నించారు.  కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో యాదిరెడ్డి, జేడీఏ నర్సింహ, సహాయ వ్యవసాయ సంచాలకులు నర్సింహచారి, వాజీద్ హుస్సేన్, వెంకటలక్ష్మి, ఏవో హరిక్రిష్ణ, ఏఈ వోలు లక్ష్మీపతి, దివ్య, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు, సర్పంచ్‌లు సుభాష్‌చంద్రబోస్, భూరోల్ల రజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
 
 ఈనెల చివరికల్లా ‘ఆధార్’ పూర్తిచేయాలి
 కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానాన్ని  ఈ నెల చివరి క ల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శనివారం  ప్రగతిభవన్‌లో ఆయన మాట్లాడారు.జిల్లాలో 3 లక్ష ల 78వేల 746 గ్యాస్ కనెక్షన్లు ఉండగా,  డిసెంబర్ చివరి కల్లా 2 లక్షల 60 వేల 46 కనెక్షన్‌లు ఆధార్ సీడింగ్ అనుసంధానంతో 73.74 శాతం పూర్తి చేశారన్నారు.  
 
 మిగితా కనెక్షన్‌లు జనవరి చివరి కల్లా పూర్తి చేయాలన్నారు.గ్యాస్ ఏజెన్సీలకు ఈ సీడింగ్ కోసం ఇన్‌చార్జీలుగా నియమించిన డిప్యూటీ తహశీ ల్దార్లు తరచూ పర్యవేక్షణ చేసి, పూర్తి స్థాయిలో సీడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, డీఎస్‌ఓ కొం డల్‌రావు, వీఎం దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement