పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు..

There is no connection to the ysrcp, says  Kattula Ravi Kumar - Sakshi

ఒక దళితుడిగా స్పందించాను: రవికుమార్‌ జైన్‌

సాక్షి, ఏలూరు : ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితుల  మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటానికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని కత్తుల రవికుమార్‌ జైన్‌ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేవలం ఒక దళితుడిగా స్పందిస్తూ చింతమనేని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలో దళితుల మనోభాలను కించపరిచే వ్యాఖ్యలను మాత్రమే కట్‌ చేసి పోస్టు చేశానని విలేకరులకు చెప్పారు. 

దళితులను అవమానపరుస్తూ చింతమనేని మాట్లాడితే దానిపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం, పోలీసులు తనపై కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. చింతమనేనిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తానేమీ చదువురాని వ్యక్తిని కాదని, ఉన్నతభావాలు కలిగిన వ్యక్తిగా, దళితుల మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో ఇది సమాజానికి తెలి యజేసేందుకు పోస్టు చేశానని చెప్పారు. మరోవైపు వీడియో షేర్‌ చేసిన రవికుమార్‌ జైన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు...దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసుల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top