కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదం..యువకుడి మృతి | The young man killed in a road accident at korlam | Sakshi
Sakshi News home page

కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదం..యువకుడి మృతి

Apr 1 2016 5:58 PM | Updated on Aug 30 2018 4:07 PM

గంట్యాడ మండలం కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

గంట్యాడ మండలం కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పింది. బైక్ పై ఉన్న  ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఎస్.కోటకు చెందిన ఎన్.నాగరాజు(25) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే నాగరాజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement