యువకుడి ఆత్మహత్య | The young man committed suicide by hanging | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Nov 29 2015 3:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాగరాజు(25) గత కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కూడా వారిద్దరి మధ్య మరో మారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement