వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు.
వెంకటాచలం: వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం అందజేసిన 13వ ఆర్థిక సంఘం నిధులు మందుగా తాగునీటి అవసరాలకు ఖర్చుచేయాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేశారన్నారు.
మండలంలో గతంలో చేసిన ప్రతిపాదనల పనులు ఇప్పటికీ ప్రారంభంకాకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్‌పైన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఆఖరు వరకు 13వ ఆర్థిక సంఘం నిధులు మరే ఇతర పనులకు కేటాయించరాదని దీనిపట్ల ఎంపీడీఓ ఖచ్చితంగా వ్యవహరించాలన్నారు. వేసవిలో రోజుకు 12గంటలకు పైగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. తాగునీటి సమస్యలపై పార్టీలకతీతంగా ప్రజల ఇబ్బందులను గుర్తించి సమన్వయంగా వ్యవహరించాలన్నారు. మండలంలో అతి చిన్నగ్రామమైన అట్రంవారికండ్రిగలో తాగునీటి సమస్య ఉండటం సిగ్గు చేటన్నారు. అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజా జమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ భాష, పి.హుస్సేన్, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్ పాల్గొన్నారు.
పరిహారం కోసం
క్రిభ్‌కో బాధితుల వేడుకోలు
సర్వేపల్లి కాశీవారికండ్రిగలోని సర్వే నంబర్ 2508లో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమిని తీసుకొని ఎపీఐఐసీ ద్వారా క్రిభ్‌కో ఎరువుల సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా కొంతమందికి పరిహారం అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు తమను ఆదుకోవాలంటూ గురువారం ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, దీని కారణంగానే నెల్లూరు ఆర్డీవో సుబ్రమణేశ్వరెడ్డిని బదిలీ చేశారని ఆయన వివరించారు.