జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య
ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య వెల్లడి
హైదరాబాద్: జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ డాక్టర్ ఆర్.హంపయ్య, సభ్య కార్యదర్శి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. జీవ వైవిధ్య చట్టం, నియమావళి, వినియోగంపై వారు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ చట్టం 2002లో వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల వన్యప్రాణులు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, జల సంపద వంటివి ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిపోతున్నాయని వివరించారు.
గిరిజనులు సేకరించే సహజ ఉత్పత్తులనేకానికి కనీస ధర కూడా ఇవ్వకుండానే పెద్దపెద్ద కంపెనీలు తరలించుకుపోతున్నాయన్నారు. మున్ముందు జీవ వైవిధ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ సౌలభ్య సంస్థ (జీఇఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని జీవ వనరుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త జి.సాయిలు తెలిపారు.