ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని ఆర్‌టీసీ బస్టాండ్ కూడలి వద్ద పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు
ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని ఆర్‌టీసీ బస్టాండ్ కూడలి వద్ద పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. టీడీపీ నేత వ్యాపార భాగస్వా మి రూ.10.5 లక్షల నగదుతో పట్టుబడ్డారు. టీడీపీ నాయుకుడు కంఠా రమేష్ వ్యాపార భాగస్వామి మోహన్‌కువూర్ ద్విచక్రవాహనంలో నగదు ను తరలిస్తుండగా అనువూనం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. ఆయన వద్ద నగదు ఉండడాన్ని గవునించి స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ అభిషేకం విలేకర్ల సవూవేశం ఏర్పాటు చేశారు. ఆయున వూట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకు మిం చి నగదును తీసుకెళ్లరాదన్న నిబంధనలు ఉన్నాయున్నారు. మోహన్‌కువూర్ 10.5 లక్షల రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డారని, దీంతో నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
నగదు వివరాలను పరిశీ లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలలో రూరల్ సీఐ గౌస్‌బాషా, వనటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ స్వా మి, కానిస్టేబుళ్లు ప్రసాద్, వుునస్వా మి పాల్గొన్నారు. అలాగే పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే మోహన్‌కువూర్ విలేకర్లతో మాట్లాడారు. తవుకు రైస్‌మిల్లులు ఉన్నాయున్నారు. వ్యాపార నిమిత్తం నగదును రైతులకు ఇవ్వడం కోసం పట్టణంలోని ఎస్‌బీఐ నుంచి నగదును డ్రా చేసుకుని తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పారు.