తెలుగు మీడియం దండగ: మంత్రి నారాయణ | telugu medium waste, says minister narayana | Sakshi
Sakshi News home page

‘తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావు’

Apr 27 2017 7:08 PM | Updated on Sep 5 2017 9:50 AM

తెలుగు మీడియం దండగ: మంత్రి నారాయణ

తెలుగు మీడియం దండగ: మంత్రి నారాయణ

దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు కీర్తిస్తే... ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖమంత్రి నారాయణ మాత్రం తెలుగు మీడియం దండగ అని వ్యాఖ్యలు చేశారు.

కర్నూలు : దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు కీర్తిస్తే... ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖమంత్రి నారాయణ మాత్రం తెలుగు మీడియం దండగ అని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగు మీడియంలో చదవితే ర్యాంకులు రావంటూ చెప్పుకొచ్చారు. అయిదువేల లోపు ర్యాంకు వచ్చే వాళ్లలో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఉండరని కొత్త భాష్యం చెప్పారు.

ఇంగ్లీష్ మీడియం అయితేనే ర్యాంకులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేశామన్నారు. నంద్యాలలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement