నక్సల్స్ దాడుల్లో తెలుగు జవాను మృతి | telugu jawan killed in naxals attack | Sakshi
Sakshi News home page

నక్సల్స్ దాడుల్లో తెలుగు జవాను మృతి

Dec 2 2014 10:31 AM | Updated on Oct 9 2018 2:51 PM

చత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన దాడుల్లో ఓ తెలుగు జవాను అసువులు బాసాడు.

అనంతపురం: చత్తీస్ గఢ్ సుకుమా జిల్లాలో  సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన దాడుల్లో ఓ తెలుగు జవాను అసువులు బాసాడు. జిల్లాలోని నల్లమాడ మండలం దొన్నికోటకు కు చెందిన కుంచెవు రామ్మోహన్ అనే జవాను ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం నక్సల్స్ తో జరిగిన పోరాటంలో రామ్మోహన్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

నక్సల్స్ సాధారణ ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుని సీఆర్‌పీఎఫ్ బలగాలపై సోమవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 13  మంది జవాన్ల మృతి చెందారు. ఆ దాడిలో మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు.  ఈ దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement