చంద్రబాబు మా చుట్టూ తిరిగినందునే.... | Telangana with the help of BJP: Nagam Janardhana Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మా చుట్టూ తిరిగినందునే....

Feb 24 2014 6:15 PM | Updated on Mar 29 2019 9:18 PM

నాగం జనార్ధన రెడ్డి - Sakshi

నాగం జనార్ధన రెడ్డి

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి అగ్ర నేతల చుట్టూ తిరిగినందునే ఆ పార్టీపై అపోహలు వచ్చినట్లు ఆ పార్టీ నేత నాగం జనార్ధన రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి అగ్ర నేతల చుట్టూ తిరిగినందునే ఆ పార్టీపై అపోహలు వచ్చినట్లు ఆ పార్టీ నేత నాగం జనార్ధన రెడ్డి తెలిపారు. బిజెపి,  సుష్మాస్వరాజ్ సహకారం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు ఆయన చెప్పారు. యుపిఏ చైర్పర్సన్  సొనియా గాంధీని పొగిడేవారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని నాగం అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు  పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందడానికి ముందు చంద్రబాబు బిజెపి ముఖ్య నేతలను కలిసిన విషయం తెలిసిందే. దాంతో బిజెపి బిల్లుకు మద్దతు ఇవ్వదేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.   బిల్లు ఆమోదం పొందిన సమయంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ  మొత్తం క్రెడిట్లో కొంత భాగాన్ని తనకు కూడా పంచాలన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్రెడిట్ ఇస్తారని, బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ చిన్నమ్మకు కూడా మరిచిపోవద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement