తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అనుభవ రాహిత్యం, అసమర్థతపై జూన్ 1 న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరువుకు రూ. 358 కోట్లు ఇచ్చినా సీఎం ఏమీ చేయలేదన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారని, ఎవరేమైనా తమకు పట్టదు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రూపాయి మంజూరు కావాలన్నా తండ్రీకొడుకులదే అధికారమన్నారు. ప్రతి విషయం కేంద్రంపై నెట్టడం సరికాదని..దీనిపై బీజేపీ నేతలు స్పందించాలని నాగం సూచించారు.