ఏపీలో టీచర‍్ల ఆందోళన ఉదృతం | teachers protest in andrapradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో టీచర‍్ల ఆందోళన ఉదృతం

Jun 21 2017 1:24 PM | Updated on Sep 5 2017 2:08 PM

ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన తీవ్రతరం చేశారు.

విజయనగరం: ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఉపాద్యాయులు అక్రమ బదీలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేతలు ఆపాలని డిమాండ్‌ చేస్తూ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
 
ఈ కార్యక్రమానికి భారీగా ఉపాధ్యాయులు తరలిరావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ స్థాయిలో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరగడంతో.. పలువురు పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనలో కలక్టరేట్‌ గేట్‌ ధ్వంసమైంది. అదే విధంగా రాష్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీచర్లు డీఈవో కార్యాలయాలను ముట్టడించి నిరసనలకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement