ఉపాధ్యాయురాలి అరెస్ట్ | teacher arrest in hindupuram | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలి అరెస్ట్

Nov 3 2015 7:32 PM | Updated on Aug 20 2018 4:27 PM

అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు కటకటాల పాలయ్యింది. అప్పు తీర్చకుండా కోర్టు వాయిదాలకు హాజరు కాని ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూపురం: అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు కటకటాల పాలయ్యింది. అప్పు తీర్చకుండా కోర్టు వాయిదాలకు హాజరు కాని ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూపురం మండలం రాచపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ సుమలత (42) అదే పాఠశాలలో సుజాత అనే టీచర్ వద్ద కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో సుజాత కోర్టును ఆశ్రయించారు. విచారణకు సుమలత హాజరు కాకపోవడంతో పోలీసులు మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement