టీడీపీ తీరు దారుణం | TDP of how brutally | Sakshi
Sakshi News home page

టీడీపీ తీరు దారుణం

Dec 31 2015 12:12 AM | Updated on Aug 10 2018 8:16 PM

జన్మభూమి కమిటీల ఎంపికలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జెడ్పీటీసీ...

జెడ్పీటీసీ యేళ్ళ జయలక్ష్మి
 
దుగ్గిరాల : జన్మభూమి కమిటీల ఎంపికలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జెడ్పీటీసీ సభ్యులు యేళ్ళ జయలక్ష్మి మండిపడ్డారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరును తప్పుపట్టిన వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. సంబంధం లేని టీడీపీ నాయకులు సమావేశానికి రావడాన్ని ఆమె తప్పుపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులను రౌడీమూకలుగా సంబోధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ కార్యక్రమాలుగా జరపాలని చూడడం, సంబంధం లేని వ్యక్తులు సమావేశానికి వచ్చి అంతరాలు సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలను తీసుకొని సమావేశంలో రౌడీయిజాన్ని తలపించేలా చేస్తోంది టీడీపీ నాయకులు మాత్రమేనని చెప్పారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కొరిటాల సురేష్, ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, పాటిబండ్డ కృష్ణప్రసాద్, యేమినేని ధనుంజయరావు, నల్లగొర్ల నాగేశ్వరరావు, శృంగారపాటి రత్నం, బనరావూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement