ధిక్కార స్వరం

TDP Leaders Steps Against Leadership - Sakshi

అధినాయకత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల అడుగులు  

విశాఖ నేతల బాటలో నడిచే యోచన  

రాజధానిగా విశాఖను కాదంటే ప్రజలు తిరస్కరిస్తారన్న భయం  

అధిష్టానానికి తేల్చి చెప్పేందుకు సన్నద్ధం 

అధినాయకుడికి చెమటలు పడుతున్నాయి.. చంద్రబాబుకు ప్రజల్లోనే కాదు పార్టీలోనూ పరపతి పోయే పరిస్థితి ఎదురవుతోంది.. అమరావతి పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. మీ స్వార్థం కోసం మా రాజకీయ జీవితాలను బలి ఇస్తారా అని సొంత పార్టీ నేతలే ప్రశి్నస్తున్నారు.. విశాఖ టీడీపీ నేతల బాటలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి.. విశాఖ రాజధాని కావాలని తేల్చి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణను ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు. మేధావులు స్వాగతిస్తున్నారు. రైతు, వ్యాపార, ఇతరత్రా వర్గాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. కానీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకోవడమే కాదు గట్టిగా పట్టుబడుతున్నది. దీన్నిబట్టి వారి స్వార్థమేంటో తేలిపోయిందని ప్రజలే చర్చించుకుంటున్నారు. అమరావతి చుట్టుపక్కల భూములన్నీ టీడీపీ నేతలు కొనుగోలు చేయడంతో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే ఎక్కడ తమ భూములకు విలువ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. దీంతో టీడీపీపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇ ప్పుడిప్పుడే ఆ పార్టీ నాయకులు గమనిస్తున్నారు. అధినాయకత్వం అజెండా నుంచి బయటపడుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలమని సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ బయటపడగా, మరికొందరు నేతలు త్వరలో ఆయన బాట పట్టనున్నారు. ప్రస్తుతం లోపాయికారీగా మంతనాలు జరుపుతున్నారు. విశాఖపట్నం టీడీపీ నేతలు ఏ విధంగానైతే మద్దతు తెలిపారో, అదేవిధంగా బయటికొచ్చి తమ అభిప్రాయం చేపేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు అజెండాకు విరుద్ధంగా... 
చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ తదితర కీలక నేతలు మాత్రమే అమరావతి అజెండాను భుజానికి ఎత్తుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా యాక్ట్‌ చేస్తున్నారు. అయితే, జిల్లా అంతటిని ఒకే దారికి తీసుకురావడంలో విఫలమయ్యారు. మొన్న జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అమరావతికి అనుకూలంగా తీర్మానం చేద్దామని గట్టిగా యతి్నంచినా వారి ఆటలు సాగలేదు. మాజీ మంత్రి కోండ్రుతోపాటు మరికొందరు అభ్యంతరం చెప్పడంతో వెనక్కి తగ్గారు.

విశాఖను రాజధానిగా ప్రజలు స్వాగతిస్తుంటే మనం వ్యతిరేకించడమేంటని అడ్డుతగలడంతో సమన్వయ కమిటీ సమావేశంలో అమరావతికి అనుకూలంగా తీర్మానం చేయలేకపోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు అజెండా నడవదని దాదాపు తేలిపోయింది. ఇంతలో రాష్ట్రంలో పరిణామాలు క్షణంక్షణం మారిపోతున్నాయి. మూడు రాజధానులకు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. పెయిడ్‌ ఆరి్టస్టులతో టీడీపీ నేతలు వెనకుండి అమరావతిలో ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు.

రాజకీయ భవిష్యత్తుపై బెంగ 
వికేంద్రీకరణకు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విశాఖను రాజధానిగా చేయవద్దని ఎవరైనా అంటే ప్రజలు తిరగబడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. చంద్రబాబు భజన చేసే నేతలు తప్ప మిగతా వారంతా పునరాలోచన చేస్తున్నారు. లోపాయికారీగా మాట్లాడుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా నేతలు ఏ విధంగానైతే సమావేశమై విశాఖను రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రకటించారో అదే రకంగా ఇక్కడి నేతలు కూడా సమావేశమై తమ అభిప్రాయాన్ని బాహాటంగా చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. కొందరు నేతలు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు.

శ్రీకాకుళంలో పలుచోట్ల వికేంద్రీకరణకు అనుకూల సదస్సులను ఏర్పాటు చేయడమే కాకుండా రాజకీయాలకు అతీతంగా ర్యాలీలు కూడా చేయాలని భావిస్తున్నారు. అందుకు తటస్థులుగా ఉన్న వారిని ముందు పెట్టి, వారి ఆధ్వర్యంలో విశాఖకు అనుకూలంగా నినదించాలని చూస్తున్నారు. చాపకింద నీరులా టీడీపీలోని కొందరు నాయకులు ప్రయతి్నస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీలో ప్రకంపనలు రేగనున్నాయి. అధిష్టానానికి ధిక్కార స్వరం విని్పంచినట్టే. చంద్రబాబు అజెండాను ఎత్తుకుంటే తమ రాజకీయ భవిష్యత్‌ పోయినట్టేనని ఆందోళన చెందుతున్నారు. రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్న, కూన, కళా తదితరులు ఎంత నచ్చచెప్పినా వినే పరిస్థితి ఉండదని, అవసరమైతే తిరుగుబాటు తప్పదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top