జాతరలో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు! | tdp leaders conduct stage dances in east godawari | Sakshi
Sakshi News home page

Dec 5 2017 9:22 AM | Updated on Aug 10 2018 9:42 PM

సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో టీడీపీ నేతలు అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపారు. అమ్మవారి జాతర సందర్భంగా రెండు స్టేజీలు ఏర్పాటుచేసి.. యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు.

అంతేకాకుండా పేకాట, గుండాటలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు టీడీపీ నేతలు కావడంతో పోలీసులు కూడా ఈ తంతును చూసీచూడనట్టు వదిలేశారు. స్థానిక ప్రజలు మాత్రం టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ అసభ్య కార్యక్రమాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement