టీడీపీ దళిత నేతల నిరసన

TDP Dalit Leaders Protest Against Attack On Dalit In Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : నగరంలోని అండేద్కర్‌ కూడలి వద్ద టీడీపీ దళిత నేతలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో సుబ్బయ్య భార్యతోపాటు దళిత నేతలంతా పాల్గొన్నారు. మంగళవారం రాత్రి కడప నగరంలో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో దళిత నేత సుబ్బయ్య పై జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన వర్గీయులు దాడి చేయడంపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చం‍ద్రబాబు సమక్షంలో దళిత నేత సుబ్బయ్యపై దాడి చేసిన పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 

దళితులను ఇలా అవమానకరంగా సంభాషించడం సరికాదన్నారు. 20 ఏళ్లుగా  ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవలు చేస్తుంటే ఇలాంటి బహుమానం ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా చంద్రబాబు చూసి చూడనట్లు వ్యవహరించడం చూస్తుంటే దళితులపై బాబుకు ఉన్న మర్యాద ఏంటో అర్ధం అవుతుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: అధినేత సమక్షంలోనే తెలుగు తమ్ముళ్ల తన్నులాట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top