బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది | Tammineni sitaram critisized AP CM | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది

Oct 26 2015 5:04 PM | Updated on Jul 11 2019 9:04 PM

బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది - Sakshi

బాబు సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది

చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.

చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సోమవారం పార్టీ ఆద్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. దసరా రోజు రాష్ట్ర ప్రజలకు రంగుల కల చూపి.. చార్జీల వాత పెట్టారని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన దసరా ఆఫర్ ఇదేనా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు అయిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అభినవ నీరో అని అభివర్ణించారు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అవినీతికి లంచాలు తీసుకుంటున్నామని ఒప్పుకుంటున్నారని.. లోకేష్ ను అవినీతికి మంత్రిగా నియమిస్తే సరిపోతుందని ఎద్దే వాచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement