ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం | take strict actions on redwood smuggling | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం

Nov 5 2014 4:08 AM | Updated on Sep 2 2017 3:51 PM

ఎర్రచందనం అక్రమ రవాణాను ఇప్పటికే చాలావరకు అరికట్టామని, పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ అన్నారు.

పీలేరు: ఎర్రచందనం అక్రమ రవాణాను ఇప్పటికే చాలావరకు అరికట్టామని, పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం పీలేరు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీలేరు పోలీస్ సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించి రెండు రోజుల్లో 125 ఎర్రచందనం దుంగలు, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలి పారు.

పది మంది స్మగ్లర్లు, 24 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అడ్డుకునేందుకు పోలీసు యం త్రాంగం చేపట్టిన చర్యలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈనెల 3న విజయవాడలో భారీ ఎత్తున ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇప్పటికే పలువురు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసి, పీడీ యాక్టుపై కేసులు నమోదు చేసి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని గుర్తు చేశారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై కళాజాతలు నిర్వహిస్తామని తెలిపారు. ము ఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement