breaking news
Red sandal wood smuggling
-
బియ్యం మాటున ‘ఎర్ర’ స్మగ్లింగ్
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ఓ కంటైనర్‌లో రూ.1.5 కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తూ ఎవరికీ అనుమానం రాకుండా దుంగలపైన బియ్యం బస్తాలను వేసినా పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదివారం విలేకరులకు వివరించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పీలేరు వద్ద ఎర్రచందనం దుంగలు తరలుతున్నట్లు సీఐ సాధిల్‌అలీకి సమాచారం రావడంతో పోలీసులు సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ కంటైనర్‌కు ముందు, వెనుక వైపు ఎస్కార్ట్లుగా వాహనాలు వెళుతుండగా వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కంటైనర్‌ను తెరచి చూశారు. తొలుత ఇందులో పోలీసులకు బియ్యం బస్తాలు కనిపించాయి. వాటిని కిందకు దింపించి చూస్తే పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా.. గుడిపాల సరిహద్దుల్లో మరో రెండు వాహనాల్లో తరలుతున్న ఎర్రచందనం దుంగలు, తీసుకెళుతున్న వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలు తీసుకెళుతున్నట్లు విచారణలో తేలింది. ఘటనలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కొత్త సురేంద్రరెడ్డి (27), వసంతు అశోక్‌కుమార్‌రెడ్డి (40), తిరుపతికి చెందిన అప్పిలి మురళి (29), యర్రమరెడ్డి రామంజులు (41), తలారి వికేష్ (26), యాదమరికి చెందిన చేంద్ర శ్రీరాములు వెంకటేష్ (32), తమిళనాడు తిరుపత్తూర్‌కు చెందిన స్వామినాథన్ సంజీవ్ (24), వేలూరుకు చెందిన జి.విజయకాంత్ (28), ఎస్.శక్తివేల్ (30), ఆర్.విజయ్‌కుమార్ (36), ఎం.వేలుసామి (42), రాజమని హరిమూర్తి (42), తిరువణ్ణామలైకి చెందిన ధనతరాన్ ఏలుమలై (37)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడున్నర టన్నుల బరువున్న 115 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
పీలేరు: ఎర్రచందనం అక్రమ రవాణాను ఇప్పటికే చాలావరకు అరికట్టామని, పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం పీలేరు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీలేరు పోలీస్ సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించి రెండు రోజుల్లో 125 ఎర్రచందనం దుంగలు, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. పది మంది స్మగ్లర్లు, 24 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందన్నారు. అడ్డుకునేందుకు పోలీసు యం త్రాంగం చేపట్టిన చర్యలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈనెల 3న విజయవాడలో భారీ ఎత్తున ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసి, పీడీ యాక్టుపై కేసులు నమోదు చేసి రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని గుర్తు చేశారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై కళాజాతలు నిర్వహిస్తామని తెలిపారు. ము ఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.