
కారు ఢీకొని యువకుడి మృతి
ముత్తుకూరు: ముత్తుకూరురోడ్డులో రిలయన్స్ చీలురోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
-పండగ రోజు విషాదం
ముత్తుకూరు: ముత్తుకూరురోడ్డులో రిలయన్స్ చీలురోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు మండలంలోని పాటూరువారికండ్రిగకు చెందిన ఆలపాక రామకృష్ణ(26) వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
రెండేళ్ల క్రితం వివాహమైన రామకృష్ణకు ఒక కొడుకు ఉండగా, భార్య గ ర్భవతి. విజయదశమి రోజున కాకుపల్లిలో వరికోత మిషన్‌కు పూజలు ముగించుకుని, మోటారుసైకిల్‌పై ఊరికి బయలుదేరాడు. కృష్ణపట్నం వైపు నుంచి తమిళనాడుకు చెందిన ఓ కారు నెల్లూరువైపు వేగంగా బయలుదేరింది. సరిగ్గా రిలయన్స్‌రోడ్డు వద్ద కారును మోటారు సైకిల్ ఢీకొంది. బైక్‌పై ఉన్న రామకృష్ణ ఎగిరి కారు అద్దాలను ఢీకొని, కింద పడ్డాడు. తలకు బలమైన గాయమవడంతో మృతి చెందాడు. చెంతనే ఉన్న పాటూరువారికండ్రిగ నుంచి మృతుడి భార్య, తల్లి, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పండగపూట జరిగిన ఈ ఘటనతో పీవీ కండ్రిగలో విషాదఛాయలు అలముకున్నాయి. కృష్ణపట్నం సీఐ గంగావెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.